: పీడీపీకి కాంగ్రెస్ మద్దతు...బీజేపీకి మద్దతివ్వమంటున్న ఎన్సీ!
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యధిక స్థానాలు సాధించిన పీడీపీకే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. బీజేపీకి మద్దతిచ్చేది లేదని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. దీంతో జమ్మూకాశ్మీర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కేవలం ఆరుగురు సభ్యుల మద్దతు తమకు ఉంటే అధికారం చేపట్టేందుకు సరిపోతుందని 25 మంది సభ్యుల బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజా తీర్పును గౌరవిస్తూ పీడీపీకి అధికారం చేపట్టే అవకాశం ఇవ్వాలని సూచించింది. అధికార దాహంతో కొంత మంది నేతలు ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడుస్తున్నారని ఆ పార్టీ మండిపడింది.