: ఆశారాం బాపుపై అత్యాచారం కేసుపెట్టిన మహిళ అదృశ్యం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసు పెట్టిన మహిళ అదృశ్యమయింది. 33 ఏళ్ల ఆ మహిళతో పాటు ఆమె భర్త, కుమారుడు కూడా కనిపించడం లేదు. వారం రోజులుగా ఆ కుటుంబం మొత్తం కనిపించడం లేదని అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు. ఆశారాం బాపు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే ఆశారాం బాపు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కనిపించకపోవడంతో, ఆమె ఆచూకీ కోసం గుజరాత్ పోలీసులు గాలింపు చేపట్టారు.