: హింస విడనాడండి...ప్రజలు పారిపోతున్నారు: మమతా బెనర్జీ
హింస విడనాడాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బోడో తీవ్రవాదులకు సూచించారు. హింసాత్మక ఘటనల కారణంగా స్థానికులు వలసలు పోతున్నారని ఆమె పేర్కొన్నారు. అసోంలో ఆదివాసీలను కాల్చి చంపిన ఘటనను ఆమె ఖండించారు. ఆదివాసీలు పునరావాసం కోసం బెంగాల్ కు తరలివస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని దీదీ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.