: డీకే అరుణ భర్త భరతసింహారెడ్డిని మించిన అవినీతి పరుడు లేడు: మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్


మాజీ మంత్రి డీకే అరుణ, ఆమె భర్తపైన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారు భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ, డీకే అరుణ భర్త భరతసింహారెడ్డిని మించిన అవినీతి పరుడు అసలు గద్వాలలోనే లేరని అన్నారు. అతనిని మించిన అవినీతిపరుడు ఉన్నట్టు ఎవరైనా నిరూపిస్తే 10 లక్షల రూపాయల రివార్డు అందజేస్తానని ఆయన సవాలు విసిరారు. ఎమ్మెల్యే డీకే అరుణ భర్త అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచంలా నిలబడుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News