: జైల్లో 18 కేజీల బరువు తగ్గా, 10 స్క్రిప్టులపై పనిచేశా: సంజూబాబా
జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు లభించడం లేదని, తనను కూడా అందరితో సమానంగానే చూస్తారని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తెలిపారు. 14 రోజుల సెలవుపై జైలు నుంచి విడుదలైన ఆయన ముంబైలో మాట్లాడుతూ, అందుకే తాను 18 కేజీల బరువు తగ్గానని తెలిపారు. జైలులో ఉంటూ 10 స్క్రిప్టులపై పని చేశానని, తాను తయారు చేసిన పది సినిమా స్క్రిప్టులపై తొందర్లోనే పని చేస్తానని సంజూ తెలిపాడు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.