: భారత్ తిరిగొచ్చాక స్వచ్ఛ భారత్ లో పాల్గొంటా: గంగూలీ
'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొనాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రస్తుతం తాను ఆస్ట్రేలియాలో ఉన్నానని, తిరిగి వచ్చాక తప్పక పాల్గొంటానని చెప్పారు. ఈ మేరకు ఓ టీవీ చానల్ ఫోన్ చేసి గంగూలీతో మాట్లాడింది. కాగా, తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలను గంగూలీ కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి రానని, ఆ ఉద్దేశం కూడా తనకు లేదని స్పష్టం చేశారు.