: ఏడు జిల్లాల గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ. 20 కోట్లు
రాష్ట్రంలోని ఏడు జిల్లాల పరిధిలోని రోడ్ల మరమ్మతులకు రూ. 20.58 కోట్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ గ్రామీణ అభివృద్ధి నిధి (ఏపీఆర్ డీఎఫ్) కింద మొత్తం 12 పనులను చేపట్టేందుకు ముందస్తు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబ్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కృష్ణా జిల్లాలో ఈ పనులను చేపడతారు.