: ఆ పెళ్ళికి అనుకోని అతిథి చిరుతపులి!
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాల్లో వైభవంగా జరుగుతున్న ఓ వివాహ వేడుకకు అనుకోని అతిథి చిరుతపులి రూపంలో వచ్చింది. ఇంకేముంది, పెళ్లి మండపం అంతా గందరగోళం! అతిథులంతా భయాందోళనలతో పరుగులు పెట్టగా, పెళ్ళికొడుకు పారిపోయి ఓ ఇంట్లో దాక్కోవాల్సి వచ్చింది. కాసేపటికి తేరుకున్న ఆడపెళ్ళివారు ఇనుప రాడ్లు, కర్రలు చేతబట్టి, దగ్గరలోని అడవి నుంచి వచ్చిన ఆ చిరుతను తరిమేశారు. తర్వాత పెళ్లికొడుకును తీసుకొచ్చి పెళ్లి జరిపించారు. ఈ ఘటనపై పెళ్ళివారు ఫిర్యాదు చేయగా, చిరుతపులిని పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి.