: హిందూ మతం స్వీకరించిన మరో 11 మంది
కేరళలో హిందూ మతంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారంనాడు 11 కుటుంబాలకు చెందిన 30 మంది హిందూ మతం స్వీకరించిన సంగతి మరచిపోకముందే మరో మతమార్పిడి చోటు చేసుకుంది. అలప్పుఝా జిల్లాలోని కాయంకుళం సమీపంలోని కేశవూర్ లో ఉన్న ఓ దేవాలయంలో ఈ రోజు 3 కుటుంబాలకు చెందిన 11 మంది హిందూ మతం స్వీకరించారు. వీరిలో కొంత మంది పూర్వికులు ఏళ్లక్రితం హిందూ మతం నుంచి ఇతర మతంలోకి మారారని స్థానిక వీహెచ్ పీ నేత తెలిపారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ స్పందిస్తూ, రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు చోటు చేసుకోవడం లేదని అన్నారు. తమ ఇష్టం మేరకు మతం మార్చుకునే వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోదని స్పష్టం చేశారు.