: వారిద్దరికి కూడా భారతరత్న ఇవ్వండి: కరుణానిధి డిమాండ్


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. అయితే, పెరియార్ గా పాప్యులర్ అయిన ద్రవిడ నాయకుడు ఈవీ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైకు కూడా భారతరత్న ఇవ్వాలని కరుణ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ఆగస్టు 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్టు తాజాగా వెల్లడించారు. అయితే మరోసారి ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. తనపై వాజ్ పేయి ఎంతో ప్రేమ చూపించేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News