: నేషనల్ కాన్ఫరెన్స్ తో బీజేపీ చర్చలు జరపలేదు: రాం మాధవ్
జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లాతో బీజేపీ చర్చలు జరిపిందంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన మాధవ్, ఆ వార్తలు ఆధారరహితమన్నారు. కిడ్నీ మార్పిడి చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను కలిసేందుకే ఒమర్ ఢిల్లీ వచ్చి వెళ్లనట్టు తెలిపారు. నిన్న (బుధవారం) రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను ఒమర్ కలసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.