: చంద్రబాబుతో భేటీ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఛైర్మన్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఛైర్మన్ రాహుల్ భాటియా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండిగో సర్వీసులను పెంచే విషయమై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై వ్యాట్ ను ఏపీ ప్రభుత్వం ఒక శాతానికి తగ్గించడంతో ఇండిగో సంస్థ వైజాగ్ పై దృష్టి సారించింది. విశాఖ నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది. విశాఖను తన హబ్ గా చేసుకోవాలని ఇండిగో ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News