: 8 స్థానాల్లో రాహుల్ ప్రచారం... ఏడింటిలో కాంగ్రెస్ ఓటమి: నిజమైన అమిత్ షా అంచనా


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ చీఫ్ అమిత్ షా వేసిన అంచనా నిజమైంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇదివరకే అమిత్ షా చెప్పారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అమిత్ షా అంచనా దాదాపుగా నిజమైందనే చెప్పాలి. ఎందుకంటే, రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిలో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి దీటుగా రాహుల్ గాంధీ నిర్వహించిన సభలకు ప్రజల నుంచి మద్దతు బాగానే లభించింది. అయితే బ్యాలెట్ బాక్సుల దగ్గరకొచ్చేసరికి ఈ మద్దతు నీరుగారిపోయింది. ఓట్లన్నీ బీజేపీ ఖాతాలో పడిపోయాయి. రాహుల్ ప్రచారం చేసిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నియోజకవర్గం దాల్తోంగంజ్ లో రాహుల్ భారీ సభనే నిర్శహించారు. అయినా త్రిపాఠికి ఓటమి తప్పలేదు.

  • Loading...

More Telugu News