: స్వచ్ఛ భారత్ కు రామోజీరావును ఆహ్వానించిన మోదీ
వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ స్థానికంగా ఉన్న అస్సీ ఘాట్ స్వచ్ఛతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, వారణాసికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది అస్సీ ఘాట్ అని చెప్పారు. దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఈసారి తాను వ్యక్తులు, సంస్థలను స్వచ్ఛభారత్ కు ఆహ్వానిస్తున్నానని తెలిపారు. స్వచ్ఛభారత్ కు మోదీ ఆహ్వానించిన వారిలో నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, కిరణ్ బేడీ, ఈనాడు గ్రూప్, ఈనాడు ఛైర్మన్ రామోజీరావు, నృత్య కళాకారిణి సోనాల్ మాన్ సింగ్, 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ, మాజీ క్రికెటర్ గంగూలీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, ఇండియా టుడే ఛైర్మన్ అరుణ్ పురి ఉన్నారు.