: పారదర్శక, జవాబుదారీ పాలన అందించి తీరుతా: ప్రధాని మోదీ
దేశ ప్రజలకు పారదర్శక, జవాబుదారీ పాలనను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. సుపరిపాలన దినాన్ని పురస్కరించుకుని నేడు దేశ ప్రజలకిచ్చిన సందేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. పారదర్శక, జవాబుదారీ పాలన కోసం ప్రభుత్వ పాలనను పునర్నిర్మిస్తామని మోదీ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశ ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25న సుపరిపాలన దినంగా పాటించనున్నట్లు ఇదివరకే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.