: సంజయ్ దత్ కోసం 'పీకే' ప్రత్యేక ప్రదర్శన


పద్నాలుగు రోజుల తాత్కాలిక సెలవుపై పూణె ఎరవాడ జైలు నుంచి బయటికి వచ్చిన నటుడు సంజయ్ దత్ 'పీకే' సినిమా వీక్షించనున్నారు. ఆ చిత్రం టీమ్ సంజయ్ కోసం రేపు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు చిత్రం ప్రొడక్షన్ టీమ్ స్పందిస్తూ "ఈ సినిమాలో ఏ ఒక్క సన్నివేశాన్నీ అంతకుముందు సంజూ చూడలేదు. ప్రమోషన్ లోనూ తను పాల్గొనలేకపోయాడు. ప్రస్తుతం బయటికి వచ్చాడు. అందుకే శాంతాక్రూజ్ థియేటర్ లో ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సిబ్బందితో కలసి చూస్తాడు" అని ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News