: చిన్నారి బాలుకు చిరు పరామర్శ


అతి చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలు అనే పదేళ్ల బాలుడిని ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి పరామర్శించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా బాలుకు చిరు ప్రత్యేక బహుమతులు అందజేశారు. క్యాన్సర్ నుంచి బాలు కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని చూసిన క్షణంలో బాలు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడు బాలుకి ఎంఎన్ జే ఆసుపత్రిలో తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. అయితే తనకు నటుడు చిరంజీవి అంటే చాలా ఇష్టమని, చూడాలని ఉందని బాలుడు కోరాడు. దాంతో ఆసుపత్రి వైద్యులు చిరుకు చెప్పడంతో వెంటనే స్పందించిన మెగాస్టార్ ఆ బాలుడిని పలకరించి, చాలాసేపు ముచ్చటించారు.

  • Loading...

More Telugu News