: చంద్రబాబుకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి బ్రోకర్లు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్రోకర్లు అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏరియల్ సర్వే కోసం తమ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో వెళుతుంటే విమర్శిస్తున్న ఈ నేతలకు... చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతుండటం కనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు ఆశపడే వీరిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు.