: టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు... పాల్గొన్న సీఎం చంద్రబాబు


హైదరాబాదులో తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన బాబు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున క్రిష్టియన్లను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జెరూసలెం యాత్రకు వెళ్లేందుకు సాయం అందిస్తామన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతామన్నారు. ఈ క్రమంలో అందరం సేవా భావంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News