: కొణతాల, దాడి వస్తామంటే వద్దనం: గంటా


వైకాపా నుంచి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ, వైకాపా నేత దాడి వీరభద్రరావులు టీడీపీలోకి వస్తే తాను వ్యతిరేకించబోనని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వారు వస్తామంటే ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు. వారి రాకను కార్యకర్తలెవరైనా వ్యతిరేకిస్తే... వారికి తాను నచ్చచెబుతానని తెలిపారు. క్యారెక్టర్ ఉన్న నేత ఎవరినైనా సరే తమ అధినేత చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటారని గంటా చెప్పారు. జాతీయ క్రీడల నిర్వహణ బిడ్డింగ్ లో ఏపీ ప్రభుత్వం పాల్గొంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News