: బోడో తీవ్రవాదులతో చర్చలు లేవు... అందరినీ హతమారుస్తాం: రాజ్ నాథ్


ఈశాన్య రాష్ట్రాల్లో 'బోడో తీవ్రవాది' అనే పదం వినిపించకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తీవ్రవాదులు పలు చోట్ల దాడులు చేసి 21 మంది మహిళలు, 18 మంది చిన్నారులు సహా 76 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. "బోడో తీవ్రవాదులు శాంతికి కట్టుబడినా, వారితో చర్చలు జరపం. వారు ఉగ్ర చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సిందే" అని రాజ్ నాథ్ హెచ్చరించారు. తీవ్రవాదులందరినీ హతమార్చేందుకు పోలీసులు 'ఆల్ అవుట్' పేరిట స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News