: నిన్న విజయవాడ అగ్రీగోల్డ్ ఎదుట ఆందోళన... నేడు విశాఖలో అగ్నిప్రమాదం!
విశాఖలోని గాజువాక, బీసీ రోడ్డులో ఉన్న అగ్రీగోల్డ్ కార్యాలయంలో నేటి ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నిన్న విజయవాడలోని అగ్రీగోల్డ్ కార్యాలయం ఎదుట తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆపై 24 గంటలు గడవకుండానే విశాఖ కేంద్రంలో అగ్నిప్రమాదం కాకతాళీయమే అయినప్పటికీ అగ్రీగోల్డ్ లో పెట్టుబడులు పెట్టినవారు సంస్థ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.