: బాస్ భార్యంటూ అశ్లీల చిత్రాల పోస్టింగ్... పోలీసుల అదుపులో హైదరాబాద్ టెక్కీ
నిత్యమూ ఏదో వంకతో తిడుతున్నాడని 'బాస్ సతీమణి చిత్రాలివే' అంటూ వివిధ వెబ్ సైట్ల నుంచి సేకరించిన అశ్లీల చిత్రాలను సహోద్యోగులకు పంపాడో టెక్కీ. ఆపై పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్ (49) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగి. ప్రతిరోజూ విధులకు తరచుగా ఆలస్యంగా వస్తుండటంతో ఉన్నతాధికారి (బాస్) ఒకరు తీవ్రంగా మందలించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీధర్, వివిధ సైట్ల నుంచి సేకరించిన అసభ్య ఫోటోలను బాస్ భార్యవే అంటూ కంపెనీలోని ఉద్యోగులకు మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో, బాస్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.