: రోశయ్య అల్లుడికిచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
నాలుగేళ్ళ క్రితం కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్ టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్ (నైస్) ఆసుపత్రికి ఇచ్చిన ఎకరం స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని మల్లెపల్లి ఐటీఐకి చెందిన 22 ఎకరాల స్థలం నుంచి నాటి సీఎం రోశయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరా స్థలాన్ని ఆయన అల్లుడికి చెందిన నైస్ ఆసుపత్రికి కేవలం రూ.1 కోటికే కట్టబెట్టారని నాయిని ఆరోపించారు. ప్రభుత్వ శిక్షణా సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆసుపత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని, రోశయ్య బంధుప్రీతికి పాల్పడ్డారని విమర్శించారు. స్థలానికి చెల్లించాల్సిన రూ.1 కోటిని కూడా ఇప్పటికీ జమ చేయలేదని, అందువల్లే స్థలాన్ని వెనక్కు తీసుకున్నామని తెలిపారు.