: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్ మస్ వేడుకలు


క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్న క్రిస్ మస్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. క్రిస్ మస్ పర్వదినం సందర్భంగా అన్ని ప్రాంతాల్లోని చర్చిలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రఖ్యాత మెదక్ చర్చిలో బుధవారం రాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి. వేడుకల్లో మెదక్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని చర్చిల్లో బుధవారం సాయంత్రం నుంచే క్రిస్ మస్ సంబరాలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన చర్చిలన్నీ క్రిస్ మస్ కాంతులతో వెలిగిపోతున్నాయి. కాగా, క్రిస్ మస్ నేపథ్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News