: నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జైపూర్ మండలంలో కొత్తగా ఏర్పాటు కానున్న సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం(ఎస్టీపీపీ) పనులపై ఆయన అధికారులతో సమీక్షించనున్నారు. నేటి ఉదయం హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్, మధ్యాహ్నం 12.15 గంటలకు జైపూర్ చేరుకుంటారు. తెలంగాణ ట్రాన్స్ కో, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉన్నతాధికారులతో విద్యుదుత్పత్తి, కొత్తగా అందుబాటులోకి రానున్న విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులు తదితరాలపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఎస్టీపీపీలో కొనసాగుతున్న పనులపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News