: పొగమంచు కారణంగా వరుసగా 28 వాహనాలు ఢీ


ఉత్తరాదిలో చలిపులి పంజా విసురుతోంది. ఉత్తరాదిలో కురుస్తున్న పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోయిడాలోని యమునా రహదారిపై సుమారు 28 వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీ కొన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది గాయాలపాలయ్యారు. గ్రేటర్ నోయిడా, జీవార్ ప్రాంతం మధ్యలోని ఎక్స్ ప్రెస్ హైవే పై దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్లే వాహనాలు కనిపించని కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వరుసగా 28 వాహనాలు వరుసగా ఒకదానితో ఒకటి ఢీ కోవడంతో, ఆ వాహనాలన్నీ దెబ్బతిన్నాయని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News