: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికైన 56 మంది కొత్తవారే!


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో అత్యధికులు కొత్తవారే కావడం విశేషం. 87 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఈ ఎన్నికల్లో 56 మంది మొదటి సారి ఎన్నికయ్యారు. కేవలం 31 మంది మాత్రమే గతంలో అసెంబ్లీకి ఎన్నికైన వారు కావడం విశేషం. దీంతో జమ్మూ కాశ్మీర్ 12వ అసెంబ్లీ మొదటి సారి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో నిండిపోనుంది. బీజేపీలో 25 మది విజయం సాధించగా, వారంతా కొత్తవారే. పీడీపీలో 19 మంది, నేషనల్ కాన్ఫరెన్స్ లో ఐదుగురు, కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు తొలిసారి ఎన్నికైన వారు కావడం విశేషం.

  • Loading...

More Telugu News