: విమానయాన ధరల క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం
విమాన ప్రయాణ ధరల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై విమానయాన సంస్థలతో చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. ఎకానమీ ప్రయాణ ధరకు పరిమితి విధించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పోటీ వాతావరణంలో ఎకానమీ టికెట్ల విక్రయానికి వెసులుబాటు లభిస్తుందని, ఎకానమీ టికెట్ ధర 20 వేల రూపాయలకు మించకుండా ఉండాలని, నిర్వహణ ఖర్చుకంటే తక్కువగా టికెట్ ధర ఉండకూడదని కేంద్రం ప్రతిపాదిస్తోంది.