: 2016 నాటికి భారత్ లో 204.1 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు


స్మార్ట్ ఫోన్లు భారత్ లో అమ్ముడవుతున్నంత వేగంగా మరే దేశంలోనూ అమ్ముడు కావేమో. దీంతో 2016 నాటికి భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించనుందని ఈ-మార్కెటర్ అనే పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ వివరాల ప్రకారం, 2016 నాటికి స్మార్ట్ ఫోన్ వినియోగించే దేశాల ఆర్డర్ ఇలా ఉండనుంది. చైనా అగ్రస్థానంలో కొనసాగితే, ద్వితీయ స్థానంలో భారత్, తృతీయ స్థానంలో అమెరికా, నాల్గవ స్థానంలో రష్యా, ఐదవ స్థానంలో జపాన్ లు ఉండనున్నాయి. చైనాలో 624.7 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు ఉండగా, భారత్ లో 204.1 స్మార్ట్ ఫోన్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అమెరికాలో 198.5 మిలియన్లు, రష్యాలో 65.1, జపాన్ లో 61.2 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉండనున్నాయని సదరు సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News