: సంజూ బాబా 8 ప్యాక్ సాధించాడు
సంజయ్ దత్ చాలా రోజుల విరామం తరువాత బయటి ప్రపంచంలోకి వచ్చాడు. జైలు అధికారులు సెలవు మంజూరు చేయడంతో సంజూబాబా బయటికి వచ్చాడు. నెరసిన జుట్టుతో సంజూ కాస్త నాజూగ్గా తయారయ్యాడు. బాలీవుడ్ హీరోలు, విలన్లు కండలు పెంచేందుకు జిమ్ లు, యోగాలు అంటూ నానాతంటాలు పడుతుంటే, జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ 8 ప్యాక్ తో బయటికి వచ్చాడు. మునుపటి కంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఒకప్పటి తన కండలను ప్రదర్శించేందుకు షర్టు తీసేసి, కేవలం బనీన్ తోనే ఫోటోలకు ఫోజులిచ్చాడు. సంజయ్ దత్ బాగున్నాడనే ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.