: రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఒకరి మృతి
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని కీలలు అలముకోవడంతో సుమారు 30 ఎకరాల్లోని గడ్డివాములు దగ్థమయ్యాయి. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలంలోని వరిగొండలో ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.