: మనిషి పోలికలతో మేకపిల్ల... షోలాపూర్ లో వింత జననం!
పులి కడుపున పులే పుడుతుందనేది వాడుకలో ఉన్న సామెత. అయితే కర్ణాటకలోని షోలా పూర్ లో మేక కడుపున అచ్చం మనిషిని పోలిన రెండు మేకలు జన్మించాయి. దీంతో అందర్లోనూ ఆసక్తి కలిగింది. ఇది విన్నవారంతా కలికాలం వచ్చేసిందా? పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినవి సాక్షాత్కరిస్తున్నాయా? కలికాలం అంతమవబోతోందా? జరుగుతున్న పరిణామాలు ఎటు తీసుకెళ్తున్నాయో తెలియదు కానీ, మహారాష్ట్రలోని షోలాపూర్ లో వింత చోటుచేసుకుంది. అచ్చం మనిషి పోలికలతో ఉన్న మగ మేక పిల్లకు ఓ మేక ఈ ఉదయం 6:30కి జన్మనిచ్చింది. ఐదు గంటల తరువాత ఆడ మేక పుట్టింది. రెండూ పుట్టక ముందే మరణించాయి. గతంలో ఈ మేక పది పిల్లలకు జన్మనివ్వగా అన్నీ మేకనే పోలి ఉండి, బతికే ఉన్నాయి. తాజాగా జన్మించిన మేకలు మాత్రం మరణించాయని వాటి యజమాని తెలిపారు. వీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఉత్సాహం చూపారు. దీనిపై పశుసంవర్థక శాఖ అధికారులు మాట్లాడుతూ, దీనిని 'ఫీటల్ అనసర్కా' అంటారని, తల్లి కడుపులో ఉండే ఉమ్మనీరు పిల్ల శరీరంలోకి చేరి ఇలా జరుగుతుందని చెప్పారు. కొన్ని సార్లు జన్యుపరమైన తేడాల వల్ల కూడా ఇలా జరుగుతుందని వారు వివరించారు.