: దర్శకుడు బాలచందర్ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ముగిశాయి. నటులు రజనీకాంత్, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, మణిరత్నం, సుహాసినిలతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు బాలచందర్ ఇంటి నుంచి నిర్వహించిన అంతిమయాత్రలోనూ పెద్ద ఎత్తున భారీగా అభిమానులు వచ్చారు. కాగా, బాలచందర్ దర్శకత్వంలో 40 సినిమాలకుపైగా నటించిన ప్రియ శిష్యుడు కమల్ హాసన్ మాత్రం ఆయనను చివరిచూపు చూడలేకపోయారు.