: జమ్ము కాశ్మీర్ లో ఆరుగురు ఎమ్మెల్యేలుంటే చాలని బీజేపీ వాదన


జమ్ము కాశ్మీర్ లో 'మిషన్ 44+' పేరుతో ప్రచారం చేసిన బీజేపీ కోరిక తీరకపోయినప్పటికీ, రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండాలని మాత్రం కోరుకోవడంలేదు. 87 అసెంబ్లీ స్థానాల్లో 28 సీట్లు గెలిచిన పీడీపీ కంటే మూడు స్థానాల తక్కువతో బీజేపీ 25 సీట్లు సాధించింది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పవన్ గుప్తా, పీపుల్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలంటోంది. ఇక ఏకైక అతిపెద్ద పార్టీగా ఏర్పడిన పీడీపీ ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. కానీ, సంఖ్యాబలం ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అంతేకాదు, బీజేపీ మద్దతు లేకుండా పీడీపీకి ఏదీ సాధ్యం కాదు. 12 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పీడీపీకి బేషరతు మద్దతు ఇచ్చినప్పటికీ అటువంటి సంకీర్ణం ఎన్నో రోజులు నిలవదని బీజేపీ భావిస్తోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ (15 మంది ఎమ్మెల్యేలు) పార్టీ జాతీయ పార్టీ (బీజేపీ)తో కలవాలనుకుంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్లాన్. అయితే అటువంటి సంకీర్ణం రెండు వైపుల నుంచి అంత తేలికగా ఏర్పడదంటున్నారు.

  • Loading...

More Telugu News