: తమిళ నటుడు విజయ్ కు కోర్టు సమన్లు


తమిళ సినీ నటుడు విజయ్ తో పాటు దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కు చెన్నైలోని ఓ కోర్టు ఈ రోజు సమన్లు జారీ చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'కత్తి' చిత్రంపై అంబు రాజశేఖర్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన 'థర్స్టీ ఎర్త్' డాక్యుమెంటరీ ఆధారంగా 'కత్తి' సినిమా తీశారని పిటిషన్ లో ఆరోపించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు విజయ్, మురుగదాస్ లకు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News