: అతని ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు... లింకు పెట్టేశారు: రాధికా ఆప్టే
'ఎవరితోనైనా రెండు రోజులు కలిసి తిరిగితే చాలు, లింకు పెట్టేస్తారు' అని రక్తచరిత్ర, లెజెండ్ ఫేమ్ రాధికా ఆప్టే రుసరుసలాడుతోంది. 'షోర్ ఇన్ ద సిటీ' అనే బాలీవుడ్ సినిమాలో తుషార్ కపూర్ తో జతకట్టిందీ చిన్నది. సినిమాలో వారి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని ముంబై మీడియా కోడై కూస్తోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాధికా ఆప్టే ఇది సిల్లీ ప్రశ్న అంటోంది. ఆ సినిమా తరువాత నేరుగా లండన్ చేరిపోయానని, తుషార్ ఫోన్ నెంబర్ కూడా తన దగ్గర లేదని చెబుతోంది.