: పార్కింగ్ సహా అన్నీ ఇంట్లోనే... ఇంటి ధర 150 కోట్లు


పార్కింగ్ సహా అన్ని సౌకర్యాలు ఇంట్లోనే ఉండేలా ఇల్లు నిర్మించుకుంటున్నారు ఔత్సాహికులు. పార్కింగ్, గార్డెన్ వంటివి గతంలో ఇంటి బయట ఉండేవి. రూఫ్ గార్డెన్లు, ఇన్నర్ గార్డెన్లు వచ్చిన తరువాత ఇంట్లోనే చక్కని నందనవనాలు వెలుస్తున్నాయి. అలాగే ఇంటి బయట ఉండే వాహనాలు గేరేజ్ లోకి మారాయి. ఇప్పుడవి సరాసరి నట్టింట్లోకి వచ్చేశాయి. సింగపూర్ లోని హామిల్టన్ స్కాట్స్ లగ్జరీ అపార్ట్ మెంట్స్ లో ఇంటితోపాటే పార్కింగ్ కూడా ఉండేలా డిజైన్ చేశారు. ఒక్కో అపార్ట్ మెంట్ లో రెండు కార్లు పార్క్ చేసుకునే సౌకర్యం కల్పించారు. 30 అంతస్తులున్న ఈ ఆకాశహర్మ్యంలోని ఎలివేటర్ లోకి కారు తీసుకువస్తే చాలు అదే వారి అపార్ట్ మెంట్ కు అనుసంధానించి ఉండే పార్కింగ్ ప్రాంతానికి కారును చేరుస్తుంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ అపార్ట్ మెంట్ రేటు ఎంతుంటుందనేగా మీ డౌటు... అక్కడికే వస్తున్నాం. ఇక్కడ ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి 60 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు లభిస్తుంది. ఫ్లాట్ కొనుక్కోవడం ఎందుకు, అద్దెకు తీసుకుంటే సరిపోలా అనుకుంటున్నారా? అద్దె కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి. నెలకు కనీసం 7 లక్షల రూపాయల అద్దె ఉంటుంది. గరిష్ఠం మీరే ఊహించుకోవచ్చు.

  • Loading...

More Telugu News