: జనవరి 6 తరువాత ఎప్పుడైనా సమ్మె చేస్తాం: ఎంప్లాయీస్ యూనియన్


సమ్మెకు దిగే విషయంపై ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సమ్మె నోటీసు ఇచ్చింది. జనవరి ఆరు తరువాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘం ఈయూ ప్రకటించింది. కాగా, సమ్మె నోటీసులో ఈయూ 18 డిమాండ్లను పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈయూ ఏపీ రాష్ట్ర కమిటీ ఇటీవలే నిర్ణయించింది. ఆర్టీసీని తక్షణమే విభజించాలని, కార్మికులకు డీఏ బకాయిలు, సీసీఎన్, ఎన్ఆర్ బీఎస్, ఎన్ బీటీల నుంచి వాడుకున్న డబ్బును యాజమాన్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. అంతేగాక కార్మికులపై పెంచుతున్న పనిభారాన్ని కూడా తగ్గించాలని కోరింది.

  • Loading...

More Telugu News