: సంక్రాంతి కోసం 5,560 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలకు ఆర్టీసీ జనవరి 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రాంతాలకు 5,560 బస్సులు నడపనున్నట్లు ఈడీ జయరావు నేటి మధ్యాహ్నం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సీబీఎస్ నుంచి బస్సు సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి, వరంగల్, యాదగిరి గుట్ట బస్సులు ఉప్పల్ నుంచి, మిగతా ప్రాంతాలకు వెళ్లే బస్సులు యథాతథంగా జేబీఎస్, ఎంజీబీఎస్ల నుంచి బయలుదేరుతాయని వివరించారు. ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని ఆయన తెలిపారు.