: తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు... ఏపీ ప్రభుత్వానికి గుత్తా హెచ్చరిక
నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వొద్దని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడాన్ని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని గుత్తా హెచ్చరించారు. రైతుల జోలికి వస్తే ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పవర్ ప్రాజెక్టులు పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపై నడవాలని ఆయన కోరారు.