: గాంధీని ఎందుకు చంపాను?: గాడ్సే వాంగ్మూలం పుస్తకం పునర్ముద్రణ


దేశ స్వాతంత్ర్యం కోసం అద్వితీయ పోరాటం చేసిన జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం వినాయక్ గాడ్సే న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన 'గాంధీని ఎందుకు చంపాను?' అనే మరాఠా పుస్తకం ఇంగ్లీష్ అనువాదాన్ని పునర్ముద్రించనున్నారు. ఢిల్లీకి చెందిన ఫార్ సైట్ పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ముద్రించనుంది. 1993 నాటి అనువాదాన్ని సవరించి ఓ వెయ్యి కాపీలు ముద్రించామని, దీనికి సంపాదకీయం వహించిన వీరేందర్ మోహ్రా తెలిపారు. కాగా, 1948 జనవరి 30న నాథూరామ్ వినాయక్ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసి పోలీసుల వద్ద లొంగిపోయాడు. గాంధీ హత్య కేసులో గోపాల్ గాడ్సే కూడా నిందితుడు. మరాఠీలో రాసిన గాంధీని ఎందుకు చంపాను? అనే పుస్తకాన్ని 1970లో హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని 1993లో ఇంగ్లీష్ లోకి అనువదించారు.

  • Loading...

More Telugu News