: రాష్ట్రంలో తొలిసారిగా 'నిర్భయ' చట్టం
ఢిల్లీ అత్యాచారం ఘటనలో మరణించిన యువతి పేరిట రూపొందిన 'నిర్భయ' చట్టం మన రాష్ట్రంలో తొలిసారిగా అమల్లోకి రానుంది. కొద్దిరోజుల క్రితం తెనాలిలో తన కుమార్తెను కామాంధుల బారి నుంచి కాపాడుకునే క్రమంలో ప్రాణాలు విడిచిన సునీల హత్య కేసులో నిందితులపై పోలీసులు 'నిర్భయ' చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. 'నిర్భయ' చట్టంలోని సెక్షన్ 354 (ఏ) క్లాజ్ ప్రకారం, బాధితురాలు మరణిస్తే దోషులకు 20 ఏళ్ళు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. సునీల కేసులో దోషులపై ఇంతకుముందు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.