: టీ.ప్రభుత్వానికి నెలకు రూ. 20 కోట్ల పన్ను ఆదాయం తగ్గింది: మంత్రి తలసాని
వాణిజ్య పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిందని టీఎస్ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెలకు రూ. 20 కోట్ల మేర ఆదాయం తగ్గిందని వెల్లడించారు. ఆదాయం పెంచుకోవడానికి పన్ను ఎగవేతలు లేకుండా చూస్తామని, దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, పన్ను వసూలు విషయంలో వ్యాపారులను ఇబ్బంది పెట్టబోమని తలసాని స్పష్టం చేశారు.