: అలా చేయడం క్రిష్టియన్ల మనోభావాలను దెబ్బతీయడమే: రఘువీరా


క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే క్రిస్మస్ రోజును కేంద్ర ప్రభుత్వం గుడ్ గవర్నన్స్ డే నిర్వహించడం సరికాదని ఏపీపీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ రోజున గుడ్ గవర్నన్స్ డేగా జరపడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. మతమార్పిడుల కారణంగా సగం ఆందోళన నెలకొన్న మైనారిటీల్లో గుడ్ గవర్నెన్స్ అనేది అభద్రతకు గురిచేయడమేనని ఆయన పేర్కొన్నారు. వాజ్ పేయికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ సెక్యులరిజానికి కట్టుబడకుండా, లౌకికతకు భంగం కల్గించేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ మతవాద ధోరణులపై టీడీపీ ప్రశ్నించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ప్రమాదకరమని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News