: నాలుగు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసిన 'పీకే'
అమీర్ ఖాన్ కథానాయకుడిగా, రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన 'పీకే' సినిమా వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. క్రిస్ మస్ సెంటిమెంటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కి బాగా కలసివచ్చింది. తాజాగా రిలీజైన 'పీకే' సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దేశీయ మార్కెట్ లో నాలుగు రోజుల్లోనే రూ. 116.63 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సినీ నటి ఆనుష్క శర్మ ట్వీట్ చేసింది.