: పచ్చా మధు హత్యకేసులో ప్రధాన నిందితుడు అరెస్టు
ఈ నెల 13న పశ్చిమ గోదావరి జిల్లా గున్నంపల్లిలో రౌడీషీటర్ పచ్చా మధు హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కాళీ కృష్ణ సహా 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పచ్చా మధును హత్య చేసేందుకు నిందితులు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వారు తెలిపారు. ఈ కేసులో నిందితులను విచారించి, వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్టు వివరించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు.