: శ్రీలంక కాందిశీకులకు ఇళ్లు నిర్మించి ఇస్తా: చంద్రబాబు
గుంటూరు జిల్లాలోని ఎన్నాదేవి గ్రామంలో నివసిస్తున్న శ్రీలంక కాందిశీకులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాసటగా నిలిచారు. 300 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కంకణాలపల్లెలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల సుఖసంతోషాలే తనకు ముఖ్యమని... వాటికోసం ఏది చేయడానికైనా తాను సిద్ధమని చెప్పారు.