: వాజ్ పేయికి భారతరత్న ప్రకటనతో ఆనందోత్సాహాల్లో కుటుంబసభ్యులు


మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఉన్న ఆయన పూర్వీకుల నివాసంలో వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వాజ్ పేయి మేనకోడలు కాంతి మిశ్రా మాట్లాడుతూ, "కుటుంబమంతా సంతోషంగా ఉంది. దేశం మొత్తం ఆనందంగా ఉంది. అంతేకాదు ప్రపంచమంతా చాలా సంతోషిస్తుందని మేమనుకుంటున్నాం. మా కుటుంబం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. ఆలస్యంగా అవార్డును తీసుకోబోతున్నా, చివరికి పురస్కారం పొందినందుకు సంతోషం" అని అన్నారు. రేపు (డిసెంబర్ 25) వాజ్ పేయి పుట్టినరోజు నేపథ్యంలో రెండు ఉత్సవాలు ఘనంగా జరపాలని కుటుంబం ప్లాన్ చేస్తోంది. ఈ అత్యంత ఆనంద సమయంలో వాజ్ పేయికి ఇష్టమైన మంగోడ్, గాజర్ కా హల్వా వంటి పలు వంటకాలను చేయనున్నట్టు మేనకోడలు మిశ్రా వెల్లడించారు.

  • Loading...

More Telugu News