: ఖాతాదారులకు డబ్బు చెల్లించని అగ్రీగోల్డ్... విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడలోని అగ్రీగోల్డ్ కార్యాలయం వద్ద నేటి మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదంటూ అగ్రీగోల్డ్ లో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళనకు దిగారు. బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో మీడియా ప్రతినిధులు సైతం పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. బాధితుల గోడును చిత్రీకరించేందుకు వెళ్ళగా, అగ్రీగోల్డ్ సిబ్బంది మీడియాపై దాడులకు దిగింది. ఈ దాడిలో పలు కెమెరాలు ధ్వంసం అయినట్టు తెలిసింది. కొందరు మీడియా ప్రతినిధులకు గాయాలు అయినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.